కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రథమ స్థానం

 వైఎస్సార్‌ జిల్లా: సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయన్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు తప్పవన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందని జాతీయ మీడియాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహర్‌రెడ్డిపై కొంతమంది బురదచల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని..అవన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు.